BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 08:03 pm
Posted by : K MAHESH

మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 08:03 PM
16 వీక్షణలు

బయ్యారం మండలంలో ముగ్గురు లబ్ధిదారులకు జనరేటర్ల పంపిణీ.. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య

బయ్యారం, నవంబర్ 13: నిరుపేద మైనారిటీ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తోడ్పాటునందిస్తున్నాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి అవసరమైన పరికరాలను అందించడం ద్వారా వారి ఆర్థిక పురోగతికి ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో బయ్యారం మండలం జగ్గుతండ గ్రామపంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్‌కు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన జనరేటర్లను గురువారం పంపిణీ చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జగ్గుతండ సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులు షేక్ చోటే నన్నే, కరీం, సయ్యద్ జనరేటర్లను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు.

జనరేటర్లు అందుకోవడంతో తమ స్వయం ఉపాధి కార్యకలాపాలకు అవసరమైన సహాయం లభించిందని లబ్ధిదారులు తెలిపారు. తమ జీవనోపాధికి తోడ్పాటునందించేలా జనరేటర్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దీపిక, తహసీల్దార్ నాగరాజు, ఉపసర్పంచ్ గుంజ వీరస్వామి, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.