BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:47 pm
Posted by : K MAHESH

ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:47 PM
19 వీక్షణలు

పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు నిర్వహించాలి.. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవుల సౌకర్యాలు కల్పించాలి: మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 13: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న పాత టెండర్లను రద్దు చేసి, నిబంధనల ప్రకారం వెంటనే కొత్త టెండర్లు నిర్వహించాలని కోరారు.

శుక్రవారం భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్ రావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్త టెండర్లు నిర్వహించాల్సి ఉండగా, నాలుగేళ్లు దాటినా పాత టెండర్లనే కొనసాగించడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్, భద్రత, రోగుల సంరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులకు తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవలందించిన కార్మికులకు ఇప్పటికీ కనీస వేతనాలు, బీమా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను సక్రమంగా అమలు చేయాలని, పండుగ సెలవులు, జాతీయ సెలవులతో పాటు అర్జిత సెలవులు కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం బోనస్ చెల్లించడంతో పాటు రెండు జతల యూనిఫాంలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇమ్రాన్ కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు వాణి, కృష్ణ, నరసింహ, ఇస్తారమ్మ, లావణ్య, సోమ నరసయ్య, సులోచన, సుగుణ, కృష్ణవేణి, భారతమ్మ, విజయలక్ష్మి, లలిత, ఉమారాణి, హేమలత, పద్మ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.