BREAKING
thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి
Test 4
Date of Publish : 14 November 2026, 08:35 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు..

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
14 Nov, 2026 - 08:35 AM
5 వీక్షణలు

చిన్నారులతో వరి సాగు చేయించిన ఉపాధ్యాయుడు

స్వయంగా వరినాట్లు వేసి, పంట పండించి, కోత కోసిన విద్యార్థులు.. రైతుల కష్టం, అన్నం విలువను ప్రత్యక్షంగా తెలుసుకున్న చిన్నారులు

ఆత్రేయపురం, నవంబర్ 14: పాఠశాల విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానాన్ని కూడా అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలిలోని ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఒకటి, రెండో తరగతులకు చెందిన చిన్నారులతో స్వయంగా వరి సాగు చేయించి, వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

ప్రధాన ఉపాధ్యాయుడు చింతా శ్యామ్‌కుమార్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యవసాయ పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మొదట పొలంలో మడిని సిద్ధం చేయడం, మడిని తొక్కడం, వరినాట్లు వేయడం వంటి పనులను స్వయంగా చేశారు. అనంతరం పంట పెరుగుదలను గమనిస్తూ, పంట కోత దశకు చేరుకున్న తర్వాత కోత కోసి ధాన్యాన్ని సేకరించారు. ఇలా విత్తనం నాటడం నుంచి ధాన్యం చేతికి వచ్చే వరకు వ్యవసాయ ప్రక్రియను చిన్నారులు ప్రత్యక్షంగా అనుభవించారు.

ఈ కార్యక్రమం ద్వారా వరి పండించడానికి రైతులు ఎంతటి కష్టం, శ్రమ, ఓర్పును చూపుతారో విద్యార్థులు తెలుసుకున్నారు. పొలంలో రైతులు చేసే ప్రతి పనిలో ఎంత శ్రమ దాగి ఉంటుందో స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ద్వారా అర్థం చేసుకున్నారు. ధాన్యం నుంచి బియ్యం తయారవడం, బియ్యం నుంచి అన్నం మన ముందుకు రావడం వెనుక రైతుల కృషి ఎంత కీలకమో చిన్నారులకు వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు చింతా శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయం, రైతుల కష్టం, ఆహార విలువ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన పంట మనకు ఆహారంగా అందుతోందని, అందువల్ల అన్నం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. అన్నంలోని ప్రతి మెతుకు వెనుక రైతు కష్టం ఉంటుందని, ఆహారాన్ని వృథా చేయకుండా గౌరవించాలనే భావనను చిన్నారుల్లో పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.

విద్యార్థులు స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొనడం వల్ల పంట సాగుపై అవగాహన పెరగడమే కాకుండా, రైతుల పట్ల గౌరవం, ఆహారం పట్ల బాధ్యత కూడా అలవడుతుందని తెలిపారు. చిన్నారులకు వ్యవసాయాన్ని ఒక ఆచరణాత్మక పాఠంగా పరిచయం చేసిన ఈ కార్యక్రమం, పుస్తకాల్లో చదివే విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకునేలా చేసింది.