ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే
ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సత్యానందరావు శుభాకాంక్షలు
కొత్తపేట: నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులు పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసీ సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.