రష్యాలో కావేరి డ్రై ఇంజిన్ ఫ్లైట్ ట్రయల్స్ పూర్తి
న్యూఢిల్లీ: భారత్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన కావేరి డ్రై ఇంజిన్ రష్యాలో హై-ఆల్టిట్యూడ్, ఫ్లైట్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
డీఆర్‌డీవో (DRDO)కు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE) అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్‌ను రష్యాలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మోటర్స్ (CIAM), గ్రోమోవ్ ఫ్లైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వద్ద పరీక్షించినట్లు సమాచారం.
హై-ఆల్టిట్యూడ్ పరిస్థితుల్లో ఇంజిన్ పనితీరుకు సంబంధించిన కీలక డేటాను పరీక్షల ద్వారా సేకరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పరీక్షల నుంచి లభించిన డేటాను CEMILAC పరిశీలించి ధృవీకరణ ప్రక్రియ చేపట్టనుంది.
ధృవీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం కావేరి డ్రై ఇంజిన్‌ను భారత స్వదేశీ ఘటక్ (Ghatak) స్టెల్త్ UCAVలో అనుసంధానం చేసే దిశగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
కావేరి ఇంజిన్‌కు సంబంధించిన ఈ పరీక్షలు పూర్తవడం స్వదేశీ విమాన ఇంజిన్ అభివృద్ధి కార్యక్రమంలో మరో ముందడుగుగా రక్షణ రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.