BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 30 September 2026, 03:46 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి సీడీపీవో సరోజినీ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
30 Sep, 2026 - 03:46 PM
17 వీక్షణలు

కనిగిరి: మార్కాపురం జిల్లా కనిగిరి ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీడీపీవో పి. సరోజినీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

కనిగిరి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై కొంతకాలంగా విమర్శలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు పరిశీలన చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే కనిగిరి పరిధిలో పనిచేస్తున్న ఓ సూపర్‌వైజర్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా కనిగిరి పట్టణ పరిధిలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త, హెల్పర్‌ను విధుల నుంచి తొలగిస్తూ సీడీపీవో గతంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఐసీడీఎస్ కేంద్రాల నిర్వహణలో పర్యవేక్షణ లోపాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సంబంధిత వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో సీడీపీవో సరోజినీపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం పంపిణీ, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.