BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 05:34 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లెలో గంజాయి స్మగ్లర్‌పై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Aug, 2026 - 05:34 PM
57 వీక్షణలు

మదనపల్లెలో గంజాయి స్మగ్లర్‌పై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్

మదనపల్లె, అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న సయ్యద్ సుల్తాన్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో రెండో వ్యక్తిగా అతడిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రయోగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. అనంతరం నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సయ్యద్ సుల్తాన్‌పై గతంలోనే 18 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి మొత్తం 51.915 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మాదకద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి, సీఐలు రాజారెడ్డి, వెంకట రమణ, ఎస్‌ఐలు రామకృష్ణారెడ్డి, రహీముల్లా తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.