కనిగిరిలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీకి చెందిన 15 కుటుంబాలు
డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు, కార్యకర్తలు
పార్టీ కండువాలతో ఆహ్వానం
కనిగిరి: కనిగిరి నియోజకవర్గంలోని గురువాజిపేట పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కూడిన 15 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఆదివారం రాత్రి కనిగిరిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
కనిగిరి మండల పార్టీ అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి, రాగిపిండి మధు, చాగంరెడ్డి రాజారెడ్డి, రెక్కల మాలకొండారెడ్డి, కుమ్మరకుంట రవి, కుమ్మరకుంట బాబు, అంబటి వీరనాగిరెడ్డి, గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో కుమ్మరకుంట భాస్కర్, కుమ్మరకుంట ప్రభాకర్, కుమ్మరకుంట రత్తమ్మ, కుమ్మరకుంట సంధ్య, కుమ్మరకుంట రవి, కుమ్మరకుంట డేవిడ్, కుమ్మరకుంట శశిధర్, కుమ్మరకుంట కిరణ్, బద్దిపూడి యేసు, కుమ్మరకుంట చిట్టిబాబు, మల్లెల అజిత్, అత్యాల కళ్యాణ్, కుమ్మరకుంట సత్య, మేక అబ్రహం, మల్లెల మధు తదితరులు ఉన్నారు.
వారికి పార్టీ కండువాలు కప్పి దద్దాల నారాయణ యాదవ్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం, పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వాకమల్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.