BREAKING
thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:55 am
Posted by : GOUTHAM RUDRARAPU

తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు!

తెలంగాణ
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
25 Oct, 2026 - 06:55 AM
16 వీక్షణలు
  • 3 వేలకు పైగా కొత్త బస్సుల కొనుగోలు.. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణే లక్ష్యం

హైదరాబాద్ (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఇప్పటికే 3 వేలకు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేశామని, ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సిటీ బస్ టెర్మినల్‌కు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ పరిసర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించేందుకు ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఈ టెర్మినల్‌ నుంచి రోజుకు సుమారు 1,053 బస్సు ట్రిప్పులు నిర్వహిస్తూ లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో కాలుష్యం పెరగకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, తొలి దశలో 250 పాత డీజిల్ బస్సులను రీట్రోఫిట్ చేస్తున్నామని పేర్కొన్నారు.

రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల బకాయిలపై చర్చలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు రూ.1,400 కోట్ల బకాయిల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టీసీని బలోపేతం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఉద్యోగుల సంక్షేమాన్ని పరిరక్షించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.