BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

35 కోట్ల ఆవు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పశువుగా రికార్డు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
110 వీక్షణలు

సాధారణంగా ఆవుల ధరలు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయి. కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ ఆవు ధర మాత్రం ఏకంగా కోట్లలో పలికింది. ఈ ఆవు విలువ సుమారు రూ.35 కోట్లు ఉండటంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది.

ఈ అరుదైన ఆవు పేరు ‘వియాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవిస్’. ఇది బ్రెజిల్‌కు చెందిన నెలోర్ జాతి ఆవు. దీని ప్రత్యేక జన్యు లక్షణాలు, అధిక పునరుత్పత్తి సామర్థ్యం, వేడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి కారణంగా దీనికి అంతటి విలువ వచ్చింది.

సుమారు నాలుగున్నరేళ్ల వయసున్న ఈ ఆవును బ్రెజిల్‌లోని అరాండు ప్రాంతంలో జరిగిన వేలంలో భారీ ధరకు కొనుగోలు చేశారు. భారత కరెన్సీలో దీని ధర దాదాపు రూ.35 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

నెలోర్ జాతి ఆవులు సాధారణంగా తెలుపు లేదా లేత రంగులో ఉంటాయి. భుజాలపై పెద్ద మూపురం, వదులుగా ఉండే చర్మం వీటి ప్రత్యేకతలు. అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునే సామర్థ్యం ఈ జాతికి ఉంటుంది.

యూరోపియన్ జాతులతో పోలిస్తే నెలోర్ ఆవుల్లో చెమట గ్రంథులు ఎక్కువగా ఉండటంతో శరీర ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించుకోగలవు. మందపాటి చర్మం వల్ల కీటకాలు, పరాన్నజీవుల నుంచి రక్షణ పొందుతాయి. అందుకే ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ జాతికి ప్రత్యేక ఆదరణ ఉంది.

విశేషం ఏమిటంటే ఈ ‘నెలోర్’ జాతి పేరుకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ప్రాంతంతో సంబంధం ఉంది. నెల్లూరు ప్రాంతం నుంచి ఈ జాతి మూలాలు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో ఈ జాతి పశువుల పెంపకం పెద్ద స్థాయిలో జరుగుతోంది.