BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 10:08 pm
Posted by : PEETHA NANI

తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
Peetha Nani Parawada Mandal
01 Sep, 2026 - 10:08 PM
60 వీక్షణలు

75 ఏళ్ల మహిళకు ప్రథమ చికిత్స అందించి ఆశ్రయం కల్పించిన స్టీల్ ప్లాంట్ పోలీసులు

విశాఖపట్నం | N Today News

స్టీల్ ప్లాంట్ పోలీసుల చొరవతో తప్పిపోయిన 75 ఏళ్ల వృద్ధ మహిళ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. స్వల్ప గాయాలతో కనిపించిన వృద్ధ మహిళకు పోలీసులు ప్రథమ చికిత్స అందించి, అనంతరం ఆమె వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో కుటుంబ సభ్యుల ఆచూకీ లభించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో క్యాండిల్ జంక్షన్ వద్ద 75 ఏళ్ల వృద్ధ మహిళ స్వల్ప గాయాలతో కనిపించారు. వెంటనే స్టీల్ ప్లాంట్ పోలీసులు ఆమెకు ప్రథమ చికిత్స అందించి, ఆమెకు ఆశ్రయం కల్పించారు.

అనంతరం వృద్ధ మహిళ వివరాలు, ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసి ఆమె కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో తనకు భర్త, పిల్లలు లేరని, మేనల్లుడి వద్ద నివాసం ఉంటున్నట్లు మహిళ తెలిపింది. ఆగస్టు 31న ఉదయం 10.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు.

వృద్ధ మహిళకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న ఆమె మేనల్లుడు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మహిళ తన మేనత్త పల్లా అప్పలనరసమ్మ, పాత గాజువాకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

దీంతో పోలీసులు పల్లా అప్పలనరసమ్మను ఆమె మేనల్లుడికి సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన వృద్ధ మహిళను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో చొరవ చూపిన స్టీల్ ప్లాంట్ పోలీసుల చర్యను పలువురు అభినందించారు.