BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 19 October 2026, 08:28 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు మున్సిపాలిటీలో టీడీపీ నుంచి 78 నామినేషన్లు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 08:28 AM
3 వీక్షణలు

వైసీపీ నుంచి ఒక్కటీ లేదు!

మొత్తం 100 నామినేషన్లు దాఖలు

చైర్మన్ అభ్యర్థిగా నయీమ్ తాజ్ పేరు ప్రచారం

పుంగనూరు: పుంగనూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రాజకీయంగా ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులపాటు సాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 100 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం.

వీటిలో తెలుగుదేశం పార్టీ నుంచి 78, జనసేన నుంచి 11, బీజేపీ నుంచి 5, ఇతరుల నుంచి 4, సీపీఐ నుంచి ఒకటి, ఎసీపీఐ నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గల కారణాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

చైర్మన్ అభ్యర్థిగా నయీమ్ తాజ్ పేరు

పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నయీమ్ తాజ్ పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఘర్షణల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత

నామినేషన్ల మొదటి రోజు చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదైనట్లు సమాచారం.

ప్రస్తుతం అందరి దృష్టి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియపై ఉంది. అభ్యర్థుల తుది జాబితా వెలువడిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే వారి సంఖ్యపై స్పష్టత రానుంది.