BREAKING
thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
Date of Publish : 17 October 2026, 04:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాత్రి నూడుల్స్ తిని నిద్రపోయిన కుటుంబం.. తెల్లారేసరికి ఐదుగురు మృతి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 04:49 PM
1 వీక్షణలు

గ్రేటర్ నోయిడాలో విషాద ఘటన.. ఫుడ్ పాయిజనింగ్‌పై పోలీసుల అనుమానం

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులతో పాటు ముగ్గురు చిన్నారులు మృతిచెందడం కలకలం రేపింది. రాత్రి భోజనంగా నూడుల్స్ తిని, టీ తాగిన కుటుంబ సభ్యులు నిద్రపోయారని, ఉదయానికి విగతజీవులుగా కనిపించారని మృతుడి తల్లి తెలిపినట్లు సమాచారం.

కుటుంబ సభ్యుల మృతికి ఆహారం కలుషితం కావడం వల్ల సంభవించిన ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, కుటుంబ సభ్యులు తిన్న ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఆహార నమూనాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణాలకు గల అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.