గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఘనంగా కుటుంబ ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ
/
మహబూబాబాద్
ఒకే వేదికపై తొమ్మిది జంటలకు సామూహిక షష్టిపూర్తి వేడుకలు
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ ఆలయ సన్నిధిలో ఆదివారం పూల్‌సింగ్–నేజీ దంపతుల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది జంటలకు ఒకే వేదికపై సామూహిక షష్టిపూర్తి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. షష్టిపూర్తి జరుపుకున్న దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి జీవితాలు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులంతా ఒకేచోట చేరడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ ఆత్మీయ సమ్మేళనం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఐక్యతను చాటింది.
కార్యక్రమ సమన్వయకర్తలుగా ఎం. రతన్, వి. రమేష్, ఎం. సుధీర్ వ్యవహరించారు.