BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 March 2026, 10:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వ్యాయామ ఉపాధ్యాయుడికి ఘనంగా పదవీ విరమణ సన్మానం

తెలంగాణ
04 Mar, 2026 - 10:12 AM
333 వీక్షణలు
పెద్దకాపర్తిలో వ్యాయామ ఉపాధ్యాయుడు బ్రహ్మయ్యకు ఘనంగా పదవీ విరమణ సన్మానం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన బ్రహ్మయ్యకు బుధవారం ఘనంగా పదవీ విరమణ మహోత్సవం నిర్వహించారు. బ్రహ్మయ్య గత 24 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. అందులో భాగంగా పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థులకు శారీరక విద్య బోధిస్తూ విశేష సేవలు అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ మాట్లాడుతూ బ్రహ్మయ్య క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి విద్యార్థులను చైతన్యపరిచారని తెలిపారు. ఆయన శిక్షణలో పెద్దకాపర్తి విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచారని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులతో కలిసి పాల్గొంటూ వారిలో ప్రతిభను వెలికితీసి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, మాజీ సర్పంచులు మర్రి జలంధర్ రెడ్డి, కందిమల్ల శిశుపాల్ రెడ్డి, కామినేని దుర్గాకుమార్, తాటి చంద్రమౌళి, ఆవుల జానయ్య, నీలకంఠం నరేష్, చేకూరి గణేష్, ఏర్పుల నరసింహ, జెల్లా ప్రశాంత్, ఏర్పుల యాదయ్య, హరీష్ రెడ్డి, గుండెబోయిన నరసింహ, ఉపాధ్యాయులు లుకేందర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, కైలాసం, లచ్చిరెడ్డి యశోదర, విజయలక్ష్మి, యాదగిరి రెడ్డి, రాధా, రవీందర్, వెంకటేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #TeacherRetirement #Brahmayya #ZPHS #EducationNews #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube