BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 06:38 am
Posted by : కూనురు మధు

అర్ధ శతాబ్దం తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Oct, 2026 - 06:38 AM
52 వీక్షణలు


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1971-72 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 55 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ బ్యాచ్ లో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 12 మంది ఇప్పటికే మృతి చెందారు. ఈ సందర్భంగా మృతి చెందిన తమ మిత్రుల జ్ఞాపకార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలను, తరగతి గదులను సందర్శించి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి పనులను నెమరువేసుకుంటూ నవ్వులు పంచుకున్నారు. సుమారు ఐదున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న మిత్రులు వయసును మరిచి చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిన అనుభూతిని పొందారు. తమ కుటుంబాలు, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలకు సంబంధించిన విశేషాలను పరస్పరం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో* పూర్వ విద్యార్థులు ఇందిరా, నిర్మల, మద్దెల మల్లయ్య, బొంతల అంజిరెడ్డి, ఉప్పరబోయిన స్వామి, ప్రతాప్, పెంటయ్య, పాండరి, రామలింగయ్య, రామచంద్రయ్య, సుధాకర్, శంకరయ్య, యాదగిరి, నారాయణ, బ్రహ్మచారి, పోతులూరు, నాగరాజుశర్మ, ఫరీద్, బిక్షమాచారి, రంగయ్య, మల్లారెడ్డి, ఈశ్వరయ్య, నరసింహారెడ్డి, యాదయ్య, కృపాసాగర్ రెడ్డి, నరేందర్, గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.