హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు
- అన్యాయంపై న్యాయపోరాటం చేస్తా
- గ్రామంలో హర్షం
ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో అర్హత సాధించి న్యాయవాదిగా ప్రస్థానం
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 25 | ఎన్ టుడే న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన బోయిన ఆదిత్య తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత జూలైలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన ఆయన శనివారం హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా బోయిన ఆదిత్య మాట్లాడుతూ, ఎలాంటి అన్యాయానికి తావులేకుండా న్యాయం కోసం పోరాడతానని తెలిపారు. తమ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, తనను నమ్మి ప్రోత్సహించిన కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
బోయిన ఆదిత్య న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేయడంపై పుట్టపాక గ్రామ ప్రజలు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.