ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. ఉపాధ్యాయుల సస్పెన్షన్
గుంటూరు జిల్లాలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు
గుంటూరు: ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన ఉపాధ్యాయులపై గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ చర్యలు తీసుకున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు, 2026 గుంటూరు జిల్లా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కోసం అక్టోబర్ 17, 2026న శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ, అప్పీలు) నిబంధనలు–1991లోని రూల్ 8(1) ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సస్పెన్షన్ కాలంలో సంబంధిత ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి లేకుండా తమ ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వారికి జీవన భృతి చెల్లించనున్నారు.