కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మ
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
అవకాశం దక్కడంతో కొత్తూరులో టీడీపీ శ్రేణుల సంబరాలు
ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో ఆదివారం నామినేషన్
కనిగిరి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రకటించింది. మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు అచ్చాల రవి భార్య అయిన తిరుపతమ్మకు అవకాశం దక్కడంతో గ్రామంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
టీడీపీ అధిష్ఠానం తనను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తిరుపతమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
తిరుపతమ్మకు అవకాశం కల్పించడంపై కొత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.