BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 10:57 pm
Posted by : KOLA MAHESH

SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
23 Oct, 2026 - 10:57 PM
19 వీక్షణలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి, ఆయన వ్యవహారశైలిపై విచారణ జరపాలి: మామిడి వెంకటరెడ్డి

రామన్నపేట, అక్టోబర్ 23 (ఎన్‌ టుడే న్యూస్‌): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను నిలిపివేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, విద్యార్థులు, యువతపై పోలీసుల నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరారు.

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులు, యువత, మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు పాల్పడటం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించి విధిస్తున్న ఆంక్షలను ఆయన విమర్శించారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు జాబితాల సవరణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయన వ్యవహారశైలిపై విచారణ జరపాలని కోరారు. SIR ప్రక్రియను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులతో పాటు ప్రతి పౌరుడిపైనా ఉందని వెంకటరెడ్డి అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలని, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలకు ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్‌, సీనియర్ న్యాయవాది ఉయ్యాల హనుమంతు గౌడ్‌, న్యాయవాదులు కట్టెల లింగస్వామి, గాలి సుదర్శన్‌, అంకేం నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.