BREAKING
thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 12:29 pm
Posted by : A. MURALIDHAR

కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
26 Oct, 2026 - 12:29 PM
13 వీక్షణలు

చట్టంపై గౌరవంతో పోరాడుదాం.. ఐకమత్యంతో ముందుకు సాగుదాం

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి (ఎన్ టుడే న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో, ధైర్యంగా, సంయమనంతో ముందుకు సాగాలని సూచించారు.

ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో, ముఖ్యంగా రెండో రోజు ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా పెద్దకొండమర్రి వద్ద ఘర్షణలు, దాడులు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇళ్లపై దాడులు జరిగినట్లు పేర్కొంటూ, ఈ ఘటనలతో సంబంధం లేని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, చట్టంపై గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పార్టీ అగ్రనాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అండదండలు పార్టీ శ్రేణులకు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొంటూ, ఐకమత్యమే పార్టీ బలమని స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో నిలబడి, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.