BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 08:29 pm
Posted by : కూనురు మధు

అది చిరుత పిల్ల కాదు... ప్రజలు భయపడొద్దు: నల్గొండ అటవీ శాఖ !

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
23 Jul, 2026 - 08:29 PM
170 వీక్షణలు

అది చిరుత పిల్ల కాదు... ప్రజలు భయపడొద్దు: నల్గొండ అటవీ శాఖ !

నల్లగొండ పట్టణంలోని ఏఆర్ నగర్‌లో అర్ధరాత్రి వేళ చిరుత పులి పిల్ల సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తీవ్రంగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ​సమాచారం అందుకున్న వెంటనే నల్గొండ వన్ టౌన్ పోలీసులు అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్ర బాబు ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, అటవీ శాఖ సిబ్బంది మరియు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ​క్షేత్రస్థాయి విచారణ అనంతరం అటవీ శాఖ అధికారులు అసలు విషయాన్ని స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో కనిపించినది చిరుత పిల్ల కాదని, అది అడవి పిల్లి’ అని తెలిపారు. అడవి పిల్లి శరీర పైభాగం, చారలు చిరుత పిల్లను పోలి ఉండటం వల్ల స్థానికులు పొరబడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు.అని ఫారెస్ట్ అధికారులు

​భయపడాల్సిన అవసరం లేదు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్ర బాబు

​ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని నల్లగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్ర బాబు తెలిపారు. అధికారిక సమాచారం వెలువడే వరకు పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.