మునగపాకలో వైఎస్సార్సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు
జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్
అనకాపల్లి జిల్లా, మునగపాక (ఎన్ టుడే న్యూస్): అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మునగపాక మాజీ జడ్పీటీసీ, సర్పంచ్ ఆడారి సరోజినీ సత్యనారాయణ దంపతుల కుమారుడు ఆడారి శ్రీకాంత్, ఆయన భార్య కమల ప్రియ జనసేన పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్సార్సీపీ మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆడారి శ్రీకాంత్ కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కమల ప్రియను మునగపాక జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రకటించే అంశంతో ఈ చేరికకు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం మునగపాక మండల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.