BREAKING
thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు
Date of Publish : 17 October 2026, 06:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో 1986–88 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 06:38 PM
9 వీక్షణలు

నాలుగు దశాబ్దాల నాటి స్నేహానికి ఆత్మీయ పలకరింపు.. ఆనాటి జ్ఞాపకాలతో ఆనందోత్సాహాలు

మధిర, అక్టోబర్ 17: నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1986–88 మధ్య ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన పూర్వ విద్యార్థులు శనివారం పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆనాటి అనుభవాలు, మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ తమ కుటుంబ వివరాలను పంచుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని ఆటపాటలతో సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తమ బ్యాచ్‌కు చెందిన ఇటీవల మృతి చెందిన పూర్వ విద్యార్థులకు నివాళులర్పించారు. వారి జ్ఞాపకార్థం ఒక నిమిషం మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ కర్నాటి రామ్మోహన్ రావు, బోటనీ అధ్యాపకులు నాగేశ్వరరావు, రాఘవయ్యలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు వారు సాధించిన ప్రగతి తమకు, కళాశాలకు, వారి తల్లిదండ్రులకు గర్వకారణమని అన్నారు. సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తూ మంచి మార్గంలో పయనించాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అతిథులకు, పూర్వ విద్యార్థులకు బహుమతులు అందజేసి సత్కరించారు. ఈ సమ్మేళనం పాత స్నేహాలను మరోసారి గుర్తుచేసి, అందరిలో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రేగళ్ల సాంబశివరావు, జంగా రామకృష్ణ, ఎస్.ఎస్.కె. బాబు, సంగమేశ్వరరావు, సీతారాములు, యాదగిరి, పీవీ బ్రహ్మం, డాక్టర్ లీలాప్రసాద్, రమేష్, మురళి, అరుణ, కోన ధనలక్ష్మి, పద్మ, జ్యోతి, వాణి, కృష్ణప్రియ, ఎంపీడీవో భారతి తదితరులు పాల్గొన్నారు.