BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 01:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికాలో ఘనంగా టీటీఏ మెగా కన్వెన్షన్ – మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 01:24 PM
131 వీక్షణలు

అమెరికాలో ఘనంగా టీటీఏ మెగా కన్వెన్షన్ – మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు నిర్వాహకులు, ప్రవాస తెలంగాణవాసులు ఆత్మీయ స్వాగతం పలికారు.

కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి, టీటీఏ ప్రతినిధులు కలిసి సీతక్కకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన "మీట్ అండ్ గ్రీట్ విత్ సీతక్క" కార్యక్రమానికి వందలాది మంది ప్రవాస తెలంగాణవాసులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పురోగతిలో ప్రవాసుల పాత్ర, సామాజిక సేవా కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించారు.