BREAKING
thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు
Date of Publish : 15 October 2026, 07:07 pm
Posted by : PABBINEEDI B SANKAR

గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
15 Oct, 2026 - 07:07 PM
10 వీక్షణలు

నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్‌ఎండీఏ అధికారులు

స్థానికుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి

తెల్లాపూర్: తెల్లాపూర్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ స్థలాన్ని సంబంధిత హెచ్‌ఎండీఏ అధికారులు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతిపాదిత స్థలం గ్రామానికి, నివాస గృహాలకు అతి సమీపంలో ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎస్టీపీని గ్రామానికి కొంత దూరంలో నిర్మించాలని అధికారులను కోరారు.

స్థానికుల అభ్యంతరాలు.. అధికారులకు వినతి

ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి అధికారులకు స్థానిక పరిస్థితులను వివరించారు. ఎస్టీపీని నివాస ప్రాంతాలకు సమీపంలో నిర్మిస్తే భవిష్యత్తులో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటూ, గ్రామస్తుల అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

గ్రామస్తుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించిన అధికారులకు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఎస్టీపీ నిర్మాణంపై నిర్ణయం తీసుకునే సమయంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, నివాస ప్రాంతాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.