మధిర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం
తెలంగాణ
/
ఖమ్మం
ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక సంఘం ప్రాంగణంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న గోవిందం కార్యక్రమంలో భాగంగా శనివారం అన్నదానం నిర్వహించారు. వివిధ భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు, అనాథలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి శనివారం అన్న గోవిందం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.