సరస్వతీ దేవిగా చిట్యాల దుర్గమ్మ దర్శనం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా.. శుక్రవారం సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దద్దోజనం, పాయసం, అటుకుల బెల్లం ను ప్రసాదముగా నివేదించారు. మూల నక్షత్రం కావటంతో భక్తులు అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. అర్చకులు వాసుదేవ శర్మ ఆచార్యతంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో హాజరై సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య బాల బాలికలచే సరస్వతి పూజ, అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో దేవస్థానం ఆలయ చైర్మన్ మారవుని ఆంజనేయులు కమిటీ సభ్యులు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారపు లింగస్వామి, జిట్ట సాయిలు, బెలిద సత్యనారాయణ, ఏళ్ల మాధవి బయ్యన్న, కమ్మర దేవి రవి, ఆలయ అధికారి ఏనుగు నరసింహారెడ్డి, అర్చకులు గోవింద్ శర్మ, దుర్గేష్ శుక్ల, సత్యం మిశ్రా, శుభం మిశ్రా, పవన్ శర్మ, సేవకులు రేగొండ వేణుమాధవ్, మహిళ భక్తులు పాల్గొన్నారు.