భద్రకాళి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకం
తెలంగాణ
/
హన్మకొండ
నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానానికి రెండేళ్ల కాలపరిమితితో ధర్మకర్తల మండలి సభ్యులను నియమించింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సభ్యులకు ఎమ్మెల్యే నాయిని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నాయిని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అమ్మవారి సేవలో అంకితభావంతో పనిచేస్తూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని నూతన ధర్మకర్తల మండలి సభ్యులకు తెలిపారు.