సీఎస్‌పురంలో వరుణ్ కుమార్ యాదవ్ నామినేషన్‌కు ఏర్పాట్లు
గురువారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి
ముఖ్య అతిథిగా కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
సీఎస్‌పురం, మార్కాపురం జిల్లా | అక్టోబర్ 21 | ఎన్ టుడే న్యూస్: కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న వరుణ్ కుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 22వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు సీఎస్‌పురం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది.
ముఖ్య అతిథిగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
ఈ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
మండల మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీ అభ్యర్థులు, మండల నాయకులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది.
ఇట్లు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, సీఎస్‌పురం.