వివాహితపై అత్యాచారయత్నం.. బండరాయితో దాడి
బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
బైక్, సెల్‌ఫోన్, పర్సు స్వాధీనం.. రిమాండ్‌కు తరలింపు
ఆభరణాలు, సెల్‌ఫోన్ తీసుకుని పరారీ
గంభీర్‌పూర్ శివారులో అరెస్ట్
కథలాపూర్, జగిత్యాల జిల్లా | ఎన్ టుడే న్యూస్: వివాహితను మాయమాటలతో బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడటంతో పాటు, ఆమెపై బండరాయితో దాడి చేసినట్లు నమోదైన కేసులో నిందితుడిని కథలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గంభీర్‌పూర్‌కు చెందిన ఏనుగుల మధు ఓ వివాహితను బైక్‌పై కథలాపూర్ శివారులోని బతుకమ్మ కుంట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె తలపై బండరాయితో దాడి చేసి హత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం బాధితురాలికి చెందిన బంగారు ఆభరణాలు, పర్సు, సెల్‌ఫోన్ తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడు ఏనుగుల మధును శుక్రవారం గంభీర్‌పూర్ శివారులో అరెస్ట్ చేసినట్లు కోరుట్ల సీఐ కొమ్ము తిరుపతి తెలిపారు. నిందితుడి నుంచి బైక్, సెల్‌ఫోన్, పర్సును స్వాధీనం చేసుకున్నామని, అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.