స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
- స్వర్ణకారుల బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి
- స్వర్ణకారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
- లింగంపల్లి మాణిక్య ప్రభు గోల్డ్‌స్మిత్ వర్క్స్ యజమాని ప్రభు చారి పిలుపు
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంగారు బహిరంగ సభకు స్వర్ణకారులందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని లింగంపల్లిలోని మాణిక్య ప్రభు గోల్డ్‌స్మిత్ వర్క్స్ యజమాని ప్రభు చారి విజ్ఞప్తి చేశారు.
స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అర్హులైన స్వర్ణకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 24వ తేదీ, శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్.బి. నగర్ సాగర్ గ్రౌండ్స్‌లో సభ జరగనుందని వెల్లడించారు. స్వర్ణకారులు, బంగారు ఆభరణాల తయారీదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
స్వర్ణకారుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రభు చారి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు.