BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 04:48 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 04:48 PM
131 వీక్షణలు

అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది_

ACB అంటే  Anti Corruption బూరెవు గవర్నమెంట్ ఉద్యోగులు లంచం అడిగితే వీళ్లే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.

1. ACB ట్రాప్ ఎలా చేస్తుంది?స్టెప్ బై స్టెప్

ముఖ్యం :లంచం ఇచ్చే ముందే ACB కి చెప్పాలి. ఇచ్చాక చెప్తే ప్రూఫ్ ఉండదు.

1.  మీరు కంప్లైంట్ ఇవ్వాలి : లంచం అడిగిన ఆఫీసర్ పేరు, డిపార్ట్‌మెంట్,ఎంత అడిగాడు,ఎందుకు అడిగాడు అని చెప్పాలి

2.  ACB వెరిఫికేషన్ : ACB DSP మిమ్మల్ని సీక్రెట్‌గా కలిసి మ్యాటర్ నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. మీరు చెప్పింది రికార్డ్ చేస్తారు

3.  ట్రాప్ ప్లాన్ : ACB వాళ్లు మీకు  ఫినాప్తలిన్ పౌడర్ రాసిన  నోట్లు ఇస్తారు. ఈ పౌడర్ కంటికి కనిపించదు. కానీ లంచం తీసుకున్నవాడు చేతికి అంటుకుంటుంది

4.  రెడ్ హ్యాండెడ్ : మీరు ఆఫీసర్‌కి డబ్బులు ఇచ్చిన వెంటనే బయట కాపు కాసిన ACB టీం లోపలికి వచ్చి ఆఫీసర్ చేతులు వాష్ చేస్తారు. నీళ్లు  పింక్ కలర  లోకి మారితే దొరికిపోయినట్టే

5. అరెస్ట్ + కేసు : వెంటనే అరెస్ట్ చేసి Prevention of Corruption Act 1988* కింద కేసు పెడతారు. 7 ఏళ్ల జైలు + జాబ్ నుండి డిస్మిస్

 సాక్ష్యం :ఫినాప్తలిన్ టెస్ట్ + మీ వాంగ్మూలం + వీడియో/ఆడియో ఉంటే కేసు స్ట్రాంగ్.

ACB WhatsApp నంబర్ కు ఫోటో, వీడియో,ఆడియో ప్రూఫ్ పంపడానికి..

 3. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు

1.  పేరు బయటకు రాదు : ACB చట్టం ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన మీ పేరు సీక్రెట్  గా ఉంచుతారు.భయపడొద్దు

2.  డబ్బులు మీవి కావాలి : ట్రాప్‌కి వాడే డబ్బులు ముందు మీరే తేవాలి.కేసు అయ్యాక కోర్టు ద్వారా మీకు తిరిగి ఇచ్చేస్తారు

3.  ఆడియో/వీడియో ఉంటే బెస్ట్ : "లంచం ఇస్తేనే పని చేస్తా" అని ఆఫీసర్ అన్న మాటలు ఫోన్‌లో రికార్డ్ చేసి ఉంటే ACB కి ఈజీ అవుతుంది

4. ట్రాప్ ఫెయిల్ అయితే :ఒకవేళ ఆఫీసర్ డౌట్ వచ్చి డబ్బులు తీసుకోకపోతే కేసు ఉండదు.కానీ ACB వాళ్లు అతనిపై నిఘా పెడతారు

 4. ACB ఎవరెవరిని పట్టుకోగలదు?

గ్రామ సెక్రటరీ నుండి కలెక్టర్ వరకు  ఏ గవర్నమెంట్ ఉద్యోగి  లంచం అడిగినా ACB పరిధిలోకే వస్తుంది.

 సర్పంచ్ :ఎన్నికైన ప్రజా ప్రతినిధి కాబట్టి ACB డైరెక్ట్‌గా ట్రాప్ చేయదు.కానీ సర్పంచ్ అవినీతిపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్* కి లేదా కలెక్టర్‌కి కంప్లైంట్ ఇస్తే ACB తో కలిసి విచారణ చేస్తారు_

_షార్ట్‌గా మీరు చేయాల్సింది_

_సెక్రటరీ/MPDO/ఇతర ఆఫీసర్ లంచం అడిగితే 

_వెంటనే 1064 కి కాల్ చేయండి_