శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
- టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం.. తిరిగి అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ (ఎన్ టుడే న్యూస్): హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో విమానానికి ప్రమాదం తప్పినట్లయింది.
వివరాల ప్రకారం, 109 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ముంబయికి బయలుదేరిన ఏఐ 417 విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్యను గుర్తించింది. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి, విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం సాంకేతిక బృందం దాన్ని పరిశీలించింది. సాంకేతిక లోపానికి గల కారణాలు, విమాన పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.