BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 07:02 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మాదకద్రవ్యాల నిర్మూలనపై యువతకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
25 Oct, 2026 - 07:02 PM
12 వీక్షణలు
  • కనిగిరిలో నషా ముక్త్‌ యువ భారత్‌ కార్యక్రమం
  • యువతతో ప్రతిజ్ఞ చేయించిన గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మండ్రు రమేష్‌బాబు

కనిగిరి | ఎన్ టుడే న్యూస్‌:

నషా ముక్త్‌ యువ భారత్‌ అభియాన్‌ 100 వారాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 11వ ఆదివారం కనిగిరి పట్టణంలోని టాకరిపాలెంలో ప్రజలకు, యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌, పారా లీగల్‌ వాలంటీర్‌ మండ్రు రమేష్‌బాబు యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మాదకద్రవ్యాల అలవాటు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, సామాజిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం పాల్గొన్న యువతతో నషా ముక్త్‌ యువ భారత్‌ ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.