డిసెంబర్ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం
అయ్యప్ప మహా పడిపూజ పోస్టర్ ఆవిష్కరణకు ఏర్పాట్లు
హనుమకొండ | ఎన్ టుడే న్యూస్: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 2026న నిర్వహించనున్న అయ్యప్ప మహా సంగమం (మహా పడిపూజ) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించేందుకు శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.
ఆదివారం, అక్టోబర్ 25న హంటర్ రోడ్‌లోని సత్యం కన్వెన్షన్ (కాకతీయ గౌడ భవన్)లో గురు సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శబరిమల మాజీ మేల్‌శాంతి మురళి నంబూద్రి విశిష్ట అతిథిగా, భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు శేషు శర్మ, అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకుడు అనంత పద్మనాభ శర్మ, భద్రకాళి అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 13న జరిగే అయ్యప్ప మహా సంగమం పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు.
తొలిసారిగా నిర్వహించడం అదృష్టం
ఏబీఏపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలో తొలిసారిగా అయ్యప్ప మహా సంగమం నిర్వహించనుండటం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు, ప్రజలు, అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
సభ్యులు, నిర్వాహకుల పాల్గొనడం
ఈ సమావేశంలో ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం రాజు, జాతీయ కోశాధికారి రవిరాజు, రాష్ట్ర కార్యదర్శి దూశెట్టి భాస్కర్, రాష్ట్ర పీఆర్వో బయాన సంతోష్ కుమార్, హనుమకొండ జిల్లా కమిటీ కార్యదర్శి గంగారం బాలరాజు, కోశాధికారి ఇనుగాల సుదర్శన్, అన్నప్రసాద వితరణ ఇన్‌చార్జి కంకటి సాగర్ గౌడ్, పీఆర్వో ఆగపాటి అజయ్, వాలంటీర్ కమాండర్ ప్రమోద్, ఫైనాన్స్ కార్యదర్శి కొండా శ్రీనివాస్‌తో పాటు పసుపుల జితేందర్, సీహెచ్ భాస్కర్, డి. కాంతారావు, డి. నరసయ్య, జక్కు, మధు కృష్ణ గౌడ్, ప్రవీణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.