BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 01:26 pm
Posted by : కూనురు మధు

బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
17 Jul, 2026 - 01:26 PM
128 వీక్షణలు

బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ ​

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పేర్కొన్నారు. శుక్రవారం  చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు సర్పంచ్ కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు కలిసి ఉచితంగా నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ వార్డెన్, విద్యార్థులతో కలిసి ఉదయం అల్పాహారాన్ని తిన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.


విద్యార్థుల ఆహారం, పుస్తకాలు, దుస్తుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సకాలంలో అందేలా ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ​ నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో బీసీ హాస్టల్ వరకు త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.