BREAKING
thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 21 October 2026, 06:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం–పర్వతాపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బూబత్తుల నాగస్వరూప ఏకగ్రీవ ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 06:38 AM
46 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం–పర్వతాపురం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బూబత్తుల నాగస్వరూపను రెండు గ్రామాల నాయకులు ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇరు గ్రామాల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానికంగా పార్టీ బలోపేతం, అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు ఏకతాటిపైకి వచ్చి నాగస్వరూప అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ ఎంపికలో బూరుగుగూడెం, పర్వతాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరథ రామరాజు, బొర్రా నాగమల్లేశ్వరి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బొర్రా నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్‌చార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె సత్యనారాయణ అలియాస్ అడవి సత్యం, కాలసాని సూర్యనారాయణ, కల్లేపల్లి ప్రభాకర్, బయగాని మల్లికార్జునరావు, చాట్రాయి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి బూబత్తుల నాగస్వరూపను గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొంటూ, బూరుగుగూడెం–పర్వతాపురం ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించి చరిత్ర తిరగరాయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండు గ్రామాల నాయకులు కలిసి అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.