BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 09:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన రిపోర్టర్‌కు రూ.12 లక్షల సాయం క్షణాల్లో స్పందించిన బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Oct, 2026 - 09:46 PM
2 వీక్షణలు

ఢిల్లీ రిపోర్టర్ శివకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన బిగ్ టీవీ యాజమాన్యం మీడియా రంగంలో ఉద్యోగుల సంక్షేమంపై చర్చకు దారితీసిన ఘటన ఇది. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన ఢిల్లీ రిపోర్టర్ శివకు చికిత్స అందించేందుకు బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం. అత్యవసర సమయంలో యాజమాన్యం స్పందించిన తీరుపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో ఆందోళనకు గురైన ఆయన భార్య, సమీపంలో ఉంటున్న ఎన్టీవీ రిపోర్టర్ రాజుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రాజు, శివను మాక్స్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేరడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. శివకు అత్యవసర వైద్యం అందించేందుకు సుమారు రూ.12 లక్షలు అవసరమని ఆస్పత్రి వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ఆస్పత్రికి అవసరమైన మొత్తాన్ని పంపించాలని అకౌంట్స్ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రూ.12 లక్షలు ఆస్పత్రికి చేరగా, వైద్య ప్రక్రియను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. సకాలంలో అందిన చికిత్సతో శివ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కథనంలో పేర్కొన్నారు. సాధారణంగా ఉద్యోగుల సంక్షేమం, అత్యవసర వైద్య సహాయం వంటి అంశాలు చర్చనీయాంశాలవుతున్న నేపథ్యంలో, ఓ ఉద్యోగి వైద్య చికిత్స కోసం యాజమాన్యం ఇంత పెద్ద మొత్తంలో సాయం అందించడం మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించింది. అత్యవసర సమయంలో సహోద్యోగి రాజు స్పందించడం, బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయం అందించడం ప్రశంసలు అందుకుంటున్నాయి.