BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 01:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆర్జీ–3, ఏపీఏ ఏరియాల్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
17 Oct, 2026 - 01:35 PM
5 వీక్షణలు

తీరొక్క పూలతో బతుకమ్మలు.. ఆడపడుచుల ఆటపాటలతో పండుగ సందడి

సింగరేణి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు సింగరేణి ఆర్జీ–3, ఏపీఏ ఏరియాల్లో ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ ఆటపాటలతో ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.

వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరిన మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. పూల పరిమళాలు, మహిళల కోలాహలం, ఆటపాటలతో వేడుకలు సందడిగా సాగాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతను, ఐక్యతను చాటుతూ బతుకమ్మ సంబురాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సింగరేణి ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచాయి. పూల పండుగ బతుకమ్మను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ మహిళలు పండుగ వైభవాన్ని చాటారు.

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ ఆటపాటలతో ఆర్జీ–3, ఏపీఏ ఏరియాల్లో పండుగ వాతావరణం నెలకొంది.