BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 18 October 2026, 07:38 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి:​జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Oct, 2026 - 07:38 PM
1 వీక్షణలు

​బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

​బెల్లంపల్లి: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యులను ఆదేశించారు. ఆదివారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, రోగుల పరిస్థితిని, ఆసుపత్రి పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ వార్డుల్లో స్వయంగా కలియతిరిగి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యం, సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు, వ్యాధుల తీవ్రతను అంచనా వేసి ఆసుపత్రిలో అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

​పండుగల వేళలలో కూడా వైద్య సేవల కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. ప్రతిరోజు వైద్యులు తప్పనిసరిగా విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ వార్డును నిరంతరం తెరిచి ఉంచాలని, అక్కడ కనీసం ఒక మెడికల్ డాక్టర్ విధిగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రికి చెందిన సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు