BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 07:27 pm
Posted by : KADARI RAMANA

భూభారతి, ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana Nirmal Rural
17 Oct, 2026 - 07:27 PM
9 వీక్షణలు
  • పార్కింగ్ నిబంధనలు పాటించని వ్యాపార సముదాయాలకు నోటీసులు
  • రహదారి ఆక్రమణలు తొలగించాలి
  • ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
  • డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం: ఎస్పీ జానకి షర్మిల
  • భూభారతి, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష

అధికారులకు కలెక్టర్ భావేష్ మిశ్రా ఆదేశాలు.. సమీక్షలో పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్, అక్టోబర్ 17: భూభారతి, సీఎం ప్రజావాణి కార్యక్రమాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారులపై ఆక్రమణలు, పశువుల సంచారం, ఇసుక అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నియంత్రణ, భూ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.

నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ సదుపాయం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రధాన రహదారులపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల కారణంగా రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే పశువులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

జాతీయ రహదారులతో పాటు మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.

జాతీయ రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా భారీ వాహనాలను నిలిపే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు, రవాణా, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు కూడా నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను వినియోగించాలని స్పష్టం చేశారు.

గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీలు) ఇసుక వేలం నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడతామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వివిధ కేసుల్లో బాధితులకు అందాల్సిన నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తామని తెలిపారు. వ్యవసాయ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో గంజాయి సాగు, విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు.

సమావేశం అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూభారతి, సీఎం ప్రజావాణి కార్యక్రమాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని, భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవరావు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్రరెడ్డి, వహింస, సబ్‌ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.