భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
ఆత్మకూర్ (ఎం)
రహీంఖాన్‌పేటలో విషాదం.. కుటుంబంలో అలుముకున్న విషాద ఛాయలు
యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన గంధమాల ఉపేందర్ (32) హైదరాబాద్‌లోని రంగారెడ్డి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఉపేందర్ కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్న అతను గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
చిన్న వయసులోనే ఉపేందర్ మృతి చెందడంతో రహీంఖాన్‌పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.