BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Date of Publish : 06 March 2026, 04:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాష్ట్ర యువ నాయకుడు పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ
06 Mar, 2026 - 04:03 AM
225 వీక్షణలు
నంద్యాలలో ఘనంగా టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ పుట్టినరోజు వేడుకలు NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు, టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నంద్యాల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఎన్ఎండి ఫయాజ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఎన్ఎండి ఫరూక్ అడుగుజాడల్లో నడుస్తూ నంద్యాల ప్రజలకు సేవ చేయడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల ప్రేమే తనకు బలమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువతను భాగస్వామ్యం చేస్తూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ యువ నాయకుడిగా ఎన్ఎండి ఫయాజ్ పార్టీ బలోపేతానికి మరియు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు మరియు ఫరూక్ అభిమానులు పాల్గొని ఎన్ఎండి ఫయాజ్‌ను ఘనంగా సన్మానించారు. #Nandyal #NMDFayaz #TDP #AndhraPradeshPolitics #BirthdayCelebrations #ChandrababuNaidu #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube