BREAKING
thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు
మంచి మాట
Date of Publish : 23 October 2026, 06:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ రూరల్ జెడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థి బాలకోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Oct, 2026 - 06:18 PM
3 వీక్షణలు
  • బాల విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ రూరల్ మండల జెడ్పీటీసీ స్థానానికి ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) పోటీ చేస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో బాలకోటేశ్వరరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న బాలకోటేశ్వరరావు గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ మండలంలో బీజేపీ అభ్యర్థి బాలకోటేశ్వరరావు విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని, కూటమి ఐక్యతతో ఎన్నికల్లో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.