తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహణపై బీజేపీ సమావేశం
జిల్లా, మండలాల వారీగా కార్యక్రమాలపై చర్చ.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహణపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న విమోచన ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ సభ్యులు సమగ్రంగా చర్చించారు.
జిల్లాల వారీగా, మండలాల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి, ఆయా ప్రాంతాల్లో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ప్రజల పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేలా విమోచన ఉత్సవాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉత్సవాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
తెలంగాణ చరిత్ర, పోరాట గాథలు, త్యాగాలను ప్రజలకు వివరించడంతో పాటు యువతకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.