BREAKING
thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్
Date of Publish : 15 October 2026, 09:47 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 09:47 AM
19 వీక్షణలు

బోయకొండలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ

చౌడేపల్లి: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

చేతిలో గరిటె, అన్నపాత్ర ధరించి బంగారు చీరలో అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను ఆకట్టుకుంది. అన్నపూర్ణేశ్వరి రూపం ఆకలిని తీర్చి, సమృద్ధిని ప్రసాదించే తల్లికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం.

ఈ సందర్భంగా ఉభయదారుల సమక్షంలో ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ గణపతి హోమం, శ్రీ చండీ హోమం నిర్వహించారు. పలువురు భక్తులు ఉభయదారులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఏకాంబరం, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఉభయదారులకు ప్రత్యేక దర్శనం కల్పించి, ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

దసరా నవరాత్రుల సందర్భంగా బోయకొండ క్షేత్రానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు “జై గంగమ్మ తల్లి” నామస్మరణతో మార్మోగాయి.