బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు
- బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు
- 60 రోజుల హుండీ లెక్కింపులో బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యం
చౌడేపల్లి (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గురువారం (అక్టోబర్ 22) నిర్వహించిన హుండీ లెక్కింపులో గత 60 రోజులకు సంబంధించి నగదు రూపంలో రూ.69,86,480 ఆదాయం లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు.
హుండీ లెక్కింపులో నగదుతో పాటు భక్తులు సమర్పించిన 26.400 గ్రాముల బంగారం, 315.510 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా అమెరికాకు చెందిన 6 డాలర్లు, ఖతార్‌కు చెందిన 1 రియాల్, కువైట్‌కు చెందిన 1 దినార్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన 20 డాలర్ల విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించినట్లు అధికారులు తెలిపారు.
అన్నదానం, రణభేరి గంగమ్మ దేవస్థానానికి కూడా ఆదాయం
దేవస్థాన అన్నదాన విభాగం హుండీ ద్వారా రూ.48,985 ఆదాయం సమకూరగా, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ద్వారా రూ.53,053 ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.
దేవస్థాన ఈవో, ఉప కమిషనర్ జె. ఏకాంబరం, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎస్. శశికుమార్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బంది, దేవస్థాన అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.