BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 February 2026, 07:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు

తెలంగాణ
24 Feb, 2026 - 07:45 AM
257 వీక్షణలు
ధ్వజారోహణంతో ప్రారంభమైన పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:50 గంటల నుండి 10:45 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టం నిర్వహించబడింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు, చక్రతాళ్వార్, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి సకలదేవతలను ఆహ్వానించారు. గరుత్మంతుని చిత్రంతో అలంకరించిన ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. రాత్రి 7 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, విద్యుత్ మరియు పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 8 నుండి 11 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నారు. వాహనసేవల వివరాలు: 24-02-2026 రాత్రి – పెద్ద శేష వాహనం 25-02-2026 ఉదయం – చిన్న శేష వాహనం రాత్రి – హంస వాహనం 26-02-2026 ఉదయం – సింహ వాహనం రాత్రి – ముత్యపుపందిరి వాహనం 27-02-2026 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం 28-02-2026 ఉదయం – మోహినీ ఉత్సవం రాత్రి – గరుడ వాహనం 01-03-2026 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం 02-03-2026 ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు – కల్యాణోత్సవం రాత్రి – గజ వాహనం 03-03-2026 ఉదయం 9:00 నుండి రాత్రి 7:00 వరకు – చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత రాత్రి 8:30 నుండి – అశ్వ వాహనం 04-03-2026 ఉదయం 9:00 – రథోత్సవం మధ్యాహ్నం 12:45 నుండి 2:00 వరకు – మిధున లగ్నంలో చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం 05-03-2026 ఉదయం 10:00 – తిరుప్పావడ సేవ రాత్రి 7:30 – శయనోత్సవం కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రకటనను టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి విడుదల చేశారు. #Punganur #Brahmotsavam #TempleFestival #AnnamayyaDistrict #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube