బ్రేకింగ్ న్యూస్ కొండపర్వలో భారీ అగ్నిప్రమాదం.. అవంటల్ కంపెనీలో ఎలక్ట్రానిక్ సామగ్రి దగ్ధం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అవంటల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కంపెనీలోని ఎలక్ట్రానిక్ సామగ్రి అగ్నికి ఆహుతైనట్లు ప్రాథమిక సమాచారం. మంటలు చెలరేగడంతో కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. స్థానికంగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మైలవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి బయలుదేరి వచ్చినట్లు సమాచారం. మంటల కారణంగా భారీ మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలు అధికారుల పరిశీలన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.